నంద్యాల అర్బన్: కొత్తూరు సుబ్రమణ్యేశ్వర స్వామి క్షేత్రానికి పోటేత్తిన భక్తులు
Nandyal Urban, Nandyal | Aug 23, 2026
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శ్రావణమాసం, ఆదివారం కావడంతో భక్తజనంతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోతుంది. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.