నందికోట్కూరు: తుడిచెర్ల గ్రామంలో ముమ్మారంగా పారిశుద్ధ్య పనులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తూడిచెర్ల గ్రామంలో ప్రజల ఆరోగ్యని కాపాడేందుకు పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టినట్లు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ పేర్కొన్నారు, ఈ మేరకు తూడిచెర్లలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రైనేజ్ కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టినట్లు తెలిపారు, పరిసరాల పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల ఆరోగ్యాలు కాపాడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు