పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం వివాహ రెసెప్షన్ కార్య క్రమంలో పాల్గొన్నారు. కలకడ మండలం గంగాపురం గ్రామంలో టీడీపీ నాయకులు బాలినేని హరిప్రసాద్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని స్థానిక నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.