కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం: పంటలు ధ్వంసం, ఆందోళనలో రైతులు
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో 8 ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. పత్తి, పామాయిల్, వరి పంటలతో పాటు విద్యుత్ మోటర్లను నాశనం చేశాయి. నెల రోజులైనా కుంకి ఏనుగులు రంగంలోకి దిగకపోవడంపై రైతులు, సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నష్టపరిహారం కోరుతున్నారు.