సిర్పూర్ టి: కాగజ్‌నగర్ బస్టాండ్ లో చోరీ, బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లోన వెళ్లి నుండి వస్తున్న బస్సు కాగజ్‌నగర్ లో ఆగడంతో చోరీ జరిగింది. పడోరే సులోచన అనే మహిళ లోన వేలు నుండి బస్సులో వస్తుండగా బస్టాండ్ వద్ద రద్దీ ఆసరా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో నుండి తులం బరువు గల రెండు ఉంగరములు దొంగిలించారు. రెండు ఉంగరాలు పోవడంతో బాధితురాలు కన్నీరు మున్నేరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కాగజ్‌నగర్ బస్టాండ్‌కు చేరుకొని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,