పుత్తూరు: పుత్తూరులో 23 మంది బాధితులకు రూ.11.64 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పుత్తూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ 23 మంది బాధితులకు రూ.11,64,702 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాల వల్ల బాధపడుతున్న పేదలకు ఈ సాయం ఎంతో తోడ్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.