మార్కాపురం: పొదిలి పోలీస్ స్టేషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసంపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్సై రాజేష్
మార్కాపురం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వర్లు భూ లావాదేవీలకు సంబంధించి కోటి 80 లక్షల రూపాయలు ఓ మహిళ వద్ద తీసుకొని మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మహిళా ఇచ్చిన ఆస్తులకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.