ఒంగోలు అర్బన్: ఇనమనమేల్లూరులో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మీడియాతో వెల్లడించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Oct 2, 2026
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఇనమనమేల్లూరు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్యటించిన ఆయన స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు మీడియాతో అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా మౌనిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. అలానే రాత్రి ఇక్కడే బస చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొన్నారు.