ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బుధవారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి శివలింగానికి అభిషేకం చేసి కార్తీక దీపాన్ని వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ పరమశివుడిని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.