మానవపాడ్: గద్వాల సమీపంలో బోల్తా పడ్డ విద్యార్థుల బస్సు; తప్పిన ప్రాణాపాయం
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి వద్ద తమిళనాడు ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. సేలం నుంచి హైదరాబాద్ వండర్లాకు వెళ్తున్న 37 మంది విద్యార్థులకు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.