మంచిర్యాల: వైద్యం అందలేదని తల్లిని వీల్ చైర్లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కొడుకు
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని బాధితుడు ఆరోపించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తల్లిని వీల్ చైర్లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నివాసానికి తీసుకెళ్లిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అనంతరం ఆర్ఎంవో జోక్యం చేసుకుని వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.