రాజోలు: డ్రెయినేజీ సమస్యతో జలమయమైన రహదారి, ఇబ్బందుల్లో స్థానికులు
రాజోలులో అన్నా క్యాంటీన్ నుంచి రెల్లి వారి పేట వరకు డ్రెయినేజీ పూడిక పడటంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. దుర్గంధం, ఈగల బెడదతో స్థానికులు ఇబ్బంది పడుతుండగా, అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.