వికారాబాద్: శివాజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా
తీసుకోవాలి: పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం భావి తరానికి స్ఫూర్తి దాయకమని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ లో ఆయన మాట్లాడుతూ మరాఠా యోధుడు, ధర్మ పరిరక్షకుడు, భరత మాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.