వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో రేపు ప్రారంభమయ్యే విజయ సంకల్పబస్సు యాత్రను బిజెపి అభిమానులు విజయవంతం చేయాలి - జిల్లా బిజెపి
రేపు తాండూర్ నుంచి ప్రారంభమై వికారాబాద్ జిల్లా కేంద్రం కు వచ్చే విజయ సంకల్ప బస్సుయాత్రను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని మంత్రిగా మోడీని మరొకసారి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.