వికారాబాద్: సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలి - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
సంతు సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనుల ఆధ్వర్యంలో వికారాబాద్ పురవిధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సత్యభారతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.