వికారాబాద్: గొట్టిముక్ల లో ఘనంగా చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ, పాల్గొన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని ముక్లలలోశివాజీ జయంతి సందర్భంగా నూతన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు కొకట్ మాధవరెడ్డి,నాయకులు నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపనకు గేరిల్ల యుద్ధ తంత్రాలను ప్రదర్శించారని,ఇతర మతాలను గౌరవిస్తూనే హిందూ సామ్రాజ్యాన్ని ఏకధాటిపైకి తీసుకువచ్చారని గుర్తు చేశారు.