ఒంగోలు అర్బన్: ఒక క్రిమినల్ పార్టీ పెట్టి పార్టీ ముసుగులో అరాచకాలు చేస్తున్నాడు: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
Ongole Urban, Prakasam | Sep 22, 2026
ఒంగోలు లో మంత్రి అచ్చం నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక క్రిమినల్ పార్టీ పెట్టి.. దాని ముసుగులో అరాచకాలు చేస్తున్నారన్నారని విమర్శించారు. వైసిపి హయాం లో ఒక్కరికైన ఉద్యోగం..ఉపాధి కల్పించారా అని ప్రశ్నించారు. డిఎస్సీ ద్వారా కస్టపడి సాధించుకున్న ఉద్యోగస్తులను అవమానించడమే కాకుండా నిరసన ముసుగులో చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారన్నారన్న మంత్రి, కూటమి ప్రభుత్వం అభివృధి.. సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.అధికారంలో ఉన్నంతకాలం నిరుద్యోగులను మోసం చేసి, ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వైసిపి నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు