రాయదుర్గం: తుంగభద్ర డ్యాం ను పరిశీలించిన మంత్రి పయ్యావుల, విప్ కాలవశ్రీనివాసులు
అనంతపురం జిల్లా కు తాగు, సాగు నీరు అందించే అంతర రాష్ట్ర జలాశయం తుంగభద్ర డ్యాం ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు పరిశీలించారు. మంగళవారం హొస్పేట సమీపంలో రిజర్వాయర్ దగ్గర జరుగుతున్న గేట్ల మార్పిడి పనులను డ్యాం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దశల వారీగా కొత్త గేట్ల అమరిక కొనసాగుతోంది. ఈనేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులపై అధికారులతో ఆరా తీశారు. రానున్న నీటి సంవత్సరంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేలా అధికారులకచ పలు సూచనలు చేశారు.