ప్రత్తిపాడు: ఒకటైన రాజకీయ ప్రత్యర్థులు.. వరుపుల సుబ్బారావు నివాసంలో కూటమి నేతల భేటీ
ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామం. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నివాసంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ సహా పలువురు కూటమి నేతలు సమావేశమయ్యారు. ఇకపై కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు.