ఒంగోలు అర్బన్: బాలభవిత కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Aug 20, 2026
బాల భవిత కేంద్రంలో చిన్నారులకు ఉపకరణాల పంపిణీ గురువారం రిమ్స్ లోని జిల్లా బాల భవిత కేంద్రంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది లక్షల రూపాయలు ఖరీదైన పరికరాలు ఒమేగా రిహబిలిటేషన్ ఫౌండేషన్ బెంగళూరు వారి ఆర్థిక సహకారంతో 18సంవత్సరాల లోపు చిన్నారులకు ఆర్థోటిక్స్,ప్రాస్థటిక్స్,వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, పంపిణీ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి చే పంపిణీచేయబడినవి.ఈ సభకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. జెసి కల్పనాకుమారి మాట్లాడుతూ ఈ చిన్నారులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు