రాయదుర్గం: అందరి ఆమోదంతోనే అమరావతి రాజధాని : అసెంబ్లీలో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
2014 ఆంద్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో చేపడుతున్న రెండు ప్రధాన సవరణలపై జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపద్యం గురించి వివరించారు. విభజన ఆంద్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనే నేపథ్యంలో సిఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అందరికీ ఆమోద యోగ్యంగా అమరావతి రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. పవిత్రమైన నేల ఇదన్నారు.