వరంగల్: ఇల్లంద ఊర చెరువుకు దేవాదుల జలాలు: ఎమ్మెల్యేను కోరనున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఊర చెరువుకు దేవాదుల జలాలు అందించాలని కోరుతూ, పార్టీలకు అతీతంగా నాయకులు, గ్రామస్తులు కాలువను పరిశీలించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.