ముధోల్: సిద్దూర్ లో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పటేల్
భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో మహిళా సమైక్య సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘానికి 2 కోట్ల రూపాయల రుణ చెక్కును పంపిణీ చేశారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.