ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కమ్మపాలెం లో జరిగిన వరుస చోరీ ఘటనలపై క్లూస్ టీం ని రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కమ్మపాలెం లో వరుస చోరీలు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ శ్రీనివాసరావు దొంగతనం జరిగిన ప్రాంతాలను పరిశీలించి క్లూస్ టీమ్ ని రంగంలోకి దించారు. దొంగల వేలిముద్రలను అధికారులు సేకరించారు. ఇంటి యజమానులు లేని సమయాలు చేసి ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు విధ్వంసం సృష్టించారు. తలుపులు పగలగొట్టి బీరువాలు బద్దలు కొట్టారు. బంగారం నగదు దోచుకు వెళ్లారు. తర్వాత ఇంటి యజమానులు ఇంటికి వచ్చిన సమయంలో చోరీ జరిగిన ఘటన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.