పూడూర్: రామగుండం అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు, కిలోమీటర్ మేర విస్తరించాయని స్థానికుల ఆందోళన
రామగుండం అటవీప్రాంతం లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటలకు గల కారణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఈ మంటలు వాటంతట అవే వచ్చినవి కావని ఎవరో కావాలని తగులబెట్టారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు