ఒంగోలు అర్బన్: మద్యం సేవించి ట్రావెల్ బస్సు నడుపుతున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 22, 2026
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు ఇతర వాహనాలను ప్రతిరోజూ ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు SI శ్రీనివాసరావు వెల్లడించారు . ఈ తనిఖీల్లో భాగంగా, ఈరోజు బాపట్ల నుంచి బెంగళూరు వెళ్తున్న వినాయక ట్రావెల్స్ బస్సును ఆపి , డ్రైవర్ ను పరీక్షించగా, అతను మద్యం సేవించి ఉన్నట్లు నిర్ధారణ అయింది అని , వెంటనే ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించాము అని తెలిపారు . అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు, కోర్టు ఆదేశాల ప్రకారం శిక్ష పడుతుందని ఆయన తెలిపారు.