వరంగల్: వరంగల్ అజాంజాహి మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు: కలెక్టర్‌ను కలిసిన ప్రొఫెసర్ హరగోపాల్
వరంగల్ అజాంజాహి మిల్లు మాజీ కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ ప్రొఫెసర్ హరగోపాల్ కలెక్టర్ సత్య శారదకు వినతిపత్రం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయం చేయాలని కోరగా, నివేదిక పంపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.