ఒంగోలు అర్బన్: జిల్లాలోని అమ్మనబ్రోలు, కరువాది గ్రామాల మధ్య పెరిగిన చిల్ల చెట్లను గ్రామస్తుల సహాయముతో తొలగింపు
Ongole Urban, Prakasam | Oct 14, 2026
ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు, కర్వాది గ్రామాల మధ్య బుధవారం స్థానిక రైతుల ప్రజలు చిల్ల చెట్లను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని దీంతో స్థానిక ప్రజలు ముప్పా సురేష్ అనే వ్యక్తిని సహాయం కోరడంతో జెసిబి ని ఏర్పాటు చేశారు. తర్వాత చిల్ల చెట్లను తొలగించి వాటిని తగలబెట్టారు. ఆ ప్రాంతంలో నీడనిచ్చే మొక్కలు నాడుతామని ప్రజలు తెలిపారు. అలానే చెట్లను తొలగించిన వారిని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.