బల్లికురవ మండలం ఉప్పమాగులూరు పరిధిలోని హరిత గ్రానైట్ ఫ్యాక్టరీ నందు శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన రాకేష్ కుమార్ అనే కూలీ గ్రానైట్ బండను క్రేన్ తో ఎత్తుచుండగా క్రేన్ ఉక్కుకు ఉన్న గొలుసు తెగిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.