శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరులో ఒక్క రోజు ముందే ప్రారంభమైన రొట్టెల పండుగ
నెల్లూరులో బారాసాహిత్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ శనివారం నుంచి ప్రారంభమైంది. ఒకరోజు ముందుగానే భక్తులు దర్గాకు రావడం మొదలైంది. స్వర్ణాల చెరువులో స్నానమాచరించి షహీద్లను దర్శించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది భక్తులు దర్గాకు వస్తున్నారు.