నర్సీపట్నం: గ్రామాల అభివృద్ధికి 11,085 కోట్లు: నాతవరంలో పల్లె పండుగ 3.0 ప్రారంభం
గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. నాతవరం మండలం డి.ఎర్రవరంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి 43.59 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.