మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో 'జన తెలంగాణ పార్టీ' ఏర్పాటు: మాజీ మావోయిస్టుల ప్రకటన
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ మావోయిస్టులు జన తెలంగాణ పార్టీని ప్రారంభించారు. నిరుద్యోగం, ఉచిత విద్య-వైద్యం, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ నేతలు లంకే బాపిరెడ్డి, అజయ్, గురిజాల రవీందర్ రావు సన్నాహక సమావేశంలో తెలిపారు.