పాలకీడు: కల్మెట్ తండాలో తాగునీటి కష్టాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన మధు నాయక్
పాలకవీడు మండలం కల్మెట్ తండాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు మధు నాయక్ వినతిపత్రం అందించారు. కృష్ణా నది నుంచి పైపులైన్ వేసి తాగునీరు అందించాలని కోరారు. మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారు.