జగిత్యాల: జగిత్యాల బైపాస్ రోడ్డులో అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న కారు
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కారు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.