ఒంగోలు అర్బన్: ఒంగోలులో నూతన జింక బొమ్మలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Oct 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతన జింక బొమ్మలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల ఆ కార్యక్రమాలను విజయవంతంగా ఆనందంగా జరుపుకోవడం జరిగిందన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా పనులు చేస్తున్నామని ఇప్పటికే కోట్ల రూపాయలను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. కిడ్స్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన జింక బొమ్మలు అందర్నీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.