దళిత కారు డ్రైవరుపై కర్నూల్ అజంతా హోటల్ యాజమాని రామ్మోహనరావు చెప్పుతో కొట్టడం, కులం పేరుతో దూషించడం తీవ్రంగా ఖండిస్తున్నామని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు అన్వర్ తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.బుధవారం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి, సంఘటనపై పత్రాన్ని సమర్పించారు. “ఇంత పెద్ద దుర్మార్గం జరిగినా ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణం,” అని అన్వర్ మండిపడ్డారు. దళితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కో