ఒంగోలు అర్బన్: రీ సర్వే ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా అధికారులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 22, 2026
రీ సర్వే ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై శనివారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు.రీ సర్వే ప్రక్రియ దశలవారీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. 494 గ్రామాలలో రీ సర్వే చేయాల్సి ఉందన్నారు. 290 గ్రామాలలోని 4 లక్షల ఎకరాలలో రీ సర్వే సమర్థంగా, పూర్తిస్థాయిలో ముగించామన్నారు. వివిధ సాంకేతిక కారణాలతో ఐదవ విడతలో 5 గ్రామాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఆరో విడతలో 36 గ్రామాలలో రీ సర్వే ప్రక్రియ జరుగుతోందన్నారు. కొన్ని గ్రామాలలో రీ సర్వే పూర్తి చేశారన్నారు.