డోన్: బేతంచర్లలో అనాధ శవానికి అంత్యక్రియలు
Dhone, Nandyal | Aug 22, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కాశినాయన ఆశ్రమం సమీపంలో సుమారు 80 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి ఎవరూ లేకపోవడంతో స్థానికులు వైకుంఠ సేవా సమితి సభ్యులను సంప్రదించారు. సమితి సభ్యులు పోలీసులకు సమాచారం అందించి, వారి అనుమతితో శనివారం బేతంచెర్లలోని ఈద్గా వద్ద మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి ఎవరూ లేకపోయినా మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించారు.