వికారాబాద్: హరితహారం లక్ష్యాలను అధిగమించాలి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లాలో హరితహారంలో భాగంగా లక్ష్యాలను అధిగమించేలా అధికారులు పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమ కార్యచరణ ప్రణాళిక పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని పేర్కొన్నారు.