వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో హరితహారం లో భాగంగా లక్ష్యాలను అధిగమించేలా అధికారులు పనిచేయాలి - అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ జిల్లా లో హరితహారం లో భాగంగా లక్ష్యాలను అధిగమించేలా అధికారులు పనిచేయాలని జిల్లా అదన కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లోని అదనం కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణకు హరితహారం కార్యక్రమం కార్యచరణ ప్రణాళిక పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హరితహారం లో గత సంవత్సరం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.