వికారాబాద్: గత ప్రభుత్వంలో కొన్ని నెలలుగా పట్టణ ప్రగతి నిధులు రాకపోవడంతో మున్సిపల్ అభివృద్ధి కొంటుపడింది - మున్సిపల్ చైర్మన్ మంజుల
గత ప్రభుత్వం లో కొన్ని నెలలుగా మున్సిపల్ అభివృద్ధికి వచ్చే పట్టణ ప్రగతి నిధులు రాకపోవడంతో వికారాబాద్ మున్సిపల్ నిధుల లేమితో ఇబ్బందులు పడిందని, సిబ్బంది వేతనాలకు కూడా ఇబ్బందిగా మారిందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని తెలిపారు.