వనపర్తి: నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష
వనపర్తి జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం మరియు పునరావాస పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేలా చూడాలని సూచించారు.