జగిత్యాల: జగిత్యాలలో యాప్ పేరుతో 5 కోట్ల మోసం: నిందితుడు అరెస్ట్
జగిత్యాలలో ఆస్పెక్ట్ ట్రేడర్ (ASPECT TRADER) యాప్ ద్వారా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి 5 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన మానాల మారుతిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు బెజ్జంకి అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.