మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విన్నపం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. అందుకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్టాండ్ వెనకవైపు ఉన్న ఖాళీ ప్రాంతంలో మందుబాబులకు అడ్డాగా మారింది. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు