జగిత్యాల: గాంధీనగర్ వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు, దెబ్బతిన్న తాగునీటి పైప్లైన్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.