ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు 565 జాతీయ రహదారిపై బూదవాడ సమీపంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొని అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతనికి ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించగా అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతని వివరాలు తెలిస్తే మర్రిపాడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు