మెదక్: రహదారులపై ధాన్యం ఆరబెడితే ప్రమాదమే.. ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక
Medak, Medak | Nov 10, 2026 రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ధాన్యం రాశులను నల్లటి పాలిథిన్ కవర్లతో కప్పడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు భద్రతను పాటించాలని ఆయన సూచించారు.