హన్వాడ: హన్వాడలో ఎండిపోతున్న పంటలు: 24 గంటల కరెంట్ కోసం శ్రీనివాస్ గౌడ్ నిరసన
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మాచారం, గుట్టుపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించిన ఆయన, మునిమోక్షం సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపి, రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.