మహబూబ్ నగర్ అర్బన్: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని పట్టణంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ
మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. సోమవారం పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంథాలయం నుంచి ఏనుగొండ ప్రధాన రహదారి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని, నిరుద్యోగుల హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.