ఒంగోలు అర్బన్: లైంగిక దాడికి గురైన విద్యార్థినిని కలిసేందుకు అనుమతిని నిరాకరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసిపి నాయకులు
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రకాశం: ఒంగోలులో అత్యాచార దాడికి గురై రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినినీ పరామర్శించేందుకు అధికారులు నిరాకరించడం పై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుమల్లి మండలంలోని బీసీ సంక్షేమ హాస్టల్ కు చెందిన విద్యార్థిని ఒంగోలులో లైంగిక దాడికి గురైంది. గురువారం వైసిపి నాయకులు బాలికను కలిసేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డు చెప్పారు. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు.